వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరినీ నిందించను: గ్రిడ్ల వైఫల్యంపై మొయిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: ఉత్తర, ఈశాన్య, తూర్పు గ్రిడ్లను విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరించారని, ఉత్తర, ఈశాన్య గ్రిడ్లు కుప్పకూలడంతో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ చెప్పారు. గ్రిడ్ల వైఫల్యంపై కమిటీని నియమించి విచారిస్తామని తెలిపారు. బుధవారం కేంద్ర విద్యుత్‌శాఖ అదనపు బాధ్యతలు చేపట్టిన వీరప్ప మొయిలీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మూడు గ్రిడ్లలోని పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. గ్రిడ్ల వైఫల్యానికి ఎవరినీ నిందించదలుచుకోలేదని ఆయన అన్నారు.

ఒకవైపు ఆగ్రా పవర్ గ్రిడ్, మరొక వైపు ఈశాన్య పవర్ గ్రిడ్ విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఈనెల 6వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని మొయిలీ చెప్పారు. సుశీల్‌కుమార్‌షిండే హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో విద్యుత్‌శాఖ ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం విద్యుత్‌శాఖను వీరప్పమొయిలీకి కట్టబెట్టింది.

సోమవారమే ఉత్తరాదిన ఈ పరిస్థితి ఏర్పడింది. గ్రిడ్‌లో మరమ్మతులు పూర్తి కావడంతో సోమవారం పరిస్థితి మెరుగుపడింది. అయితే మంగ ళవారంనాడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అనుకోకుండా ఈశాన్య గ్రిడ్ కూడా విఫలం కావడంతో పరిస్థితి ఇంకా గడ్డుగా మారింది. ఫలితంగా దాదాపు 20 రాష్ట్రాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, 60 కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారని పవర్‌గ్రిడ్ చైర్మన్ ఆర్‌ఎస్ నాయక్ అన్నారు. ఉత్తరభారతంలో 9, ఈశాన్యంలో 4, నార్త్ ఈస్ట్‌లో 7 రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా లెదన్నారు.

జమ్మ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, బీహార్,యూపీ, రాజస్థాన్, పశ్శిమబెంగాల్, పంజాబ్, జార్ఖండ్, ఒడిసా, అస్సాం, సిక్కింలలో సరిస్థితి మరింతా దారుణంగా ఉందన్నారు. ఈ రోజు రాత్రి 7గంటలకల్లా పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. ఢిల్లీలో మెట్రోరైళ్ల సర్వీసులను పాక్షికంగా పునర్ధిదించామని చెప్పారు. రాష్ట్రాలు అధిక విద్యుత్తును వాడటం వల్లే గ్రిడ్‌లు కుప్పకూలాయని నాయక్ అన్నారు.

English summary
The newly-appointed power minister Veerappa Moily on Wednesday refrained from blaming states for over-drawing electricity that may have led to the collapse of the three grids on Tuesday and said he will focus on combating the many troubles that are facing the sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X