బాగాలేదు: అఖిలేష్ ప్రభుత్వంపై ములాయం అసంతృప్తి

ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రతిష్ఠను పెంచే చర్యలు చేపట్టాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు. మంగళవారం రాత్రి పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన అఖిలేశ్.. తన పాలనపై మొదటిసారిగా, అదీ తన తండ్రి నుంచే విమర్శలు ఎదురుకావడంతో.. ఏమీ చెప్పలేక పోయారు.
మొత్తానికి తండ్రి వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ములాయం అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని, పొరపాట్లు ఉంటే దిద్దుకుంటామని అఖిలేశ్ చెప్పారు. అయితే.. రాష్ట్రంలో గణనీయ స్థాయిలో మార్పులు తీసుకురావడానికి అఖిలేశ్ ప్రభుత్వానికి ములాయం ఆరు నెలలు గడువు ఇచ్చారట.
ఆ లోగానే ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రతిష్ఠను పెంచే చర్యలు తీసుకోవాలని ఆయన అప్పట్లోనే సూచించారు. కానీ, ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా పెద్ద స్థాయిలో ప్రజలను ఆకర్షించలేకపోతున్నారని ములాయం పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే తనయుడి పాలనపై ములాయం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications