వివరాలు వచ్చాక: నీలిమ మృతిపై సిపి, ఆ కాల్ కీలకం

అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఎవరో బలవంతంగా భవనంపై కిందకు తోసేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో వాస్తవాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు. గురువారం నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడారు.
కాల్ లిస్టును సేకరించామని చెప్పారు. నీలిమ కేసులో తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. నీలిమ మృతికి ముందు ఎవరెవరితో మాట్లాడిందనే విషయాలపై ఆరా తీశామని చెప్పారు. పూర్తిస్థాయిలో పోస్టుమార్టం వివరాలు బయటకు వచ్చాకే అన్నీ వెల్లడిస్తామన్నారు. సెక్యూరిటీ గార్డు వాంగ్మూలాన్ని రికార్డు చేశామని చెప్పారు.
కాగా రెండు రోజుల క్రితం ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న సాఫ్టువేర్ ఉద్యోగిని నీలిమ భవనంపై నుండి దూకి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుందని సంస్థ చెబుతుండగా, ఎవరో చంపేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications