వైవాహికేతర సంబంధం: భార్యను కత్తితో చీరేసిన భర్త

అతను ఓ సెలూన్‌లో పనిచేస్తున్నాడు. సెలూన్‌లో వాడే కత్తితో భార్యను చీరేశాడు. ముఖంపై, ఛాతీపై తీవ్రంగా గాయాలయ్యాయి. గుర్తు పట్టలేని స్థితికి ఆమె చేరుకుంది. అతన్ని ఆపడానికి స్థానికులు భయపడ్డారు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి చేర్చడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ మహిళ ధైర్యం చేసి ఆమెను ఆస్పతికి తీసుకుని వెళ్లింది.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థి మరణించాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న వీరవెల్లి రాజేష్ బాబు అనే పాతికేళ్ల యువకుడు కళాశాలకు మోటార్ బైక్‌పై వెళ్తూ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు.
రాజేష్ బాబు తలకు తీవ్రమైన గాయం అయింది. విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యంలోనే మరణించాడు. అతని తమ్ముడు దేవాకాంత్ కూడా అదే వాహనం మీద ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన దేవాకాంత్‌ను ఏలూరు ఆశ్రమ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications