హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదోఫ్లోర్ నుండి పడలేదు: టెక్కీ నీలిమ మృతిపై నివేదిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Neelima
హైదరాబాద్: ఇన్ఫోసిస్ సాఫ్టువేర్ ఇంజనీర్ నీలిమ మృతదేహానికి గాంధీ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం చేసి ఓ నివేదికను రూపొందించారు. ఆ నివేదికను వారు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ పోస్టుమార్టం ద్వారా వెలుగులోకి వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాలని వారు ఫోరెన్సిక్ ల్యాబ్‌ నిపుణులను కోరారు. గురువారం నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు శుక్రవారం ఆ నివేదికను ల్యాబ్‌కు అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు పంపించారు.

నీలిమది ఆత్మహత్య కాదని గాంధీ వైద్యులు తమ నివేదికలో అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నీలిమ భవనం యొక్క పదో అంతస్తు పై నుండి పడినట్లుగా తాము అనుమానించడం లేదని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. అంత ఎత్తు నుండి పడితే తీవ్ర రక్తస్రావంతో పాటు శరీర భాగాలా బాగా దెబ్బతింటాయని వారు అందులో పేర్కొన్నారు. అయితే నీలిమ మృతి విషయంలో తమకు అలాంటి ఆధారాలు ఏవీ కనిపించలేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆమెది హత్యగా వారు అనుమానిస్తున్నారు.

కాగా రెండు రోజుల క్రితం ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న సాఫ్టువేర్ ఉద్యోగిని నీలిమ భవనంపై నుండి దూకి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుందని సంస్థ చెబుతుండగా, ఎవరో చంపేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఆమె కాల్ డేటాను పోలీసులు సేకరించారు. ఘటనకు ఐదు నిమిషాల ముందు వచ్చిన ఫోన్ నెంబరు ఎవరిదనే అంశంపై వారు ఆరా తీస్తున్నారు. నీలిమ భవనంపై నుంచి కిందకు పడగానే తొలుత గమనించిన సెక్యూరిటీ గార్డు రమేష్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

కాగా నీలిమ చనిపోవడానికి పదిహేను నిమిషాల ముందు ఓ వ్యక్తితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అతనిని ఓసారి పోలీసులు విచారించారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేయగా అతను స్విచ్చాఫ్ చేశాడని సమాచారం.

English summary
It is said that Gandhi hospital doctors are suspecting that Infosys software engineer Neelima's dead in not suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X