సుదర్శన్ అదృశ్యం: వెనక్కి తెచ్చిన కొరియర్ బాయ్

ఆయనకు కొద్దిగా మతిస్థిమితం కోల్పోయారని తెలుస్తోంది. దీంతో ఆయన ప్రతి రోజు ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లేటప్పుడు ఆయన వెంట ఓ సహాయకుడు ఉంటారు. ఈ రోజు ఉదయం కూడా మార్నింగ్ వాక్‌కు వెళ్లే సమయంలో సహాయకుడు వచ్చేలోగానే సుదర్శన్‌జీ వాక్ కోసం బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. కాస్త మతిస్థిమితం కోల్పోవడం, సహాయకుడు వెంట లేక పోవడం కారణంగా ఆయన దారి తప్పి ఉంటారని భావిస్తున్నారు.
సుదర్శన్ అదృశ్యమైనట్లు మైసూరులోని నజరబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. ఆయన ఆచూకీ కోసం మైసూరు శివార్‌లలోని సుమారు 25 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన దారి తప్పి ఉంటారని ఆయన దొరుకుతారని సంఘ్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్‌జీ 2000-2009 మధ్య రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చీఫ్‌గా పని చేశారు.
కాగా పోలీసులు, సంఘ్ కార్యకర్తలు సుదర్శన్‌జీ గురించి తీవ్రంగా గాలించారు. కాసేపటికి ఆయన ఆచూకి లభ్యమైంది. సుదర్శన్‌జీ తన నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒంటరిగా కూర్చుని కనిపించారు. సుదర్శన్‌ను ఓ కొరియర్ బాయ్ గుర్తించి తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications