వీధి పోరాటమే: మన్మోహన్‌కు వైయస్ విజయమ్మ లేఖ

YS Vijayamma
హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించిన గ్యాస్‌కు మహారాష్ట్రకు మళ్లించడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శనివారం తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహారాష్ట్ర రత్నగిరికి గ్యాస్ కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే న్యాయం కోసం ప్రజలు వీధులకెక్కడం తప్ప గత్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్ర రత్నగిరి విద్యుత్కేంద్రానికి మళ్లిండచంతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం ఓ లేఖ రాశారు.

ఎపికి చెందిన సహజవాయు వాటాను మహారాష్ట్రలోని రత్నగిరికి మళ్లించడంపై జోక్యం చేసుకోవాలని ఆమె తన లేఖలో ప్రధానిని కోరారు. ఆగస్టు 1న పెట్రోలియం, సహజవాయువుల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయకపోతే న్యాయం కోసం రాష్ట్ర ప్రజలు వీధులలోకి వస్తారని తెలిపారు. కొన్ని రాష్ట్రాలకు, కొన్ని ప్రాజెక్టులకు తమ ఇష్టానుసారం సహజవాయువును కేటాయించే అధికారం మంత్రుల సాధికారిక బృందానికి లేదని తెలిపారు.

మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఎపిని త్యాగం చేయమనడం సబబు కాదన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ కు నెలలో 12 రోజుల పాటు కోత విధించారని, మంత్రుల బృందం నిర్ణయం వల్ల రాష్ట్ర పరిశ్రమలు ఇకపై నెలంతా కోతలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రత్నగిరిని నిర్మించింది విదేశాల నుంచి ఎగుమతి చేసుకునే ఎల్ఎన్‌జి ఆధారంగా అని కాబట్టి ఆ ప్రాజెక్టుకు రాష్ట్రం నుండి గ్యాస్ కేటాయించాల్సిన అవసరం లేదన్నారు.

కెజి బేసిన్ గ్యాస్ ఆధారంగా దేశంలో మరెక్కడా గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీ గానీ, విద్యుత్ ప్రాజెక్టు గానీ నిర్మితం కాలేదని అందులో పేర్కొన్నారు. కెజి బెసిన్‌లో రిలయన్స్‌కు చెందిన డి6 బ్లాకు నుండి మళ్లీ ఉత్పాదన మొదలైనప్పుడు సహజంగా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ ఇవ్వడం న్యాయమని, ముందు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చాకే ఇతర ప్రాజెక్టులకు ఇవ్వాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+