• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాపం కూడా వైయస్‌దే: గ్యాస్ తరలింపుపై విహెచ్

By Pratap
|

V Hanumanth Rao
న్యూఢిల్లీ/ విజయవాడ: కేజీ బేసిన్ గ్యాస్ వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరగడానికి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వైఖరే కారణమని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రత్నగిరి ప్లాంట్‌కు మొదటి ప్రాధాన్య క్రమంలో గ్యాస్ కేటాయించాలంటూ 2008లోనే నిర్ణయం జరిగిందని అంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గ్యాస్ కేటాయింపుల విషయాన్ని ఎప్పుడూ పార్లమెంటు సభ్యుల వద్ద ప్రస్తావించలేదని చెప్పారు. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధానితో పాటు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున సన్మానించనున్నట్లు ఎంపీ వి. హనుమంతరావు తెలిపారు. వచ్చే శనివారం గాంధీభవన్‌లో జరిగే ఈ సన్మానసభలో బీసీ నేతలంతా పాల్గొంటారని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయపార్టీలకు చెందిన నేతలంతా జైపాల్‌రెడ్డిని అభినందిస్తుంటే సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స మాత్రం ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. కాగా మొదటి నుంచీ కాంగ్రెస్సే బీసీల ఛాంపియన్‌గా నిలిచిందని వీహెచ్ వ్యాఖ్యానించారు. బీసీల్లో వచ్చిన రాజకీయ చైతన్యం దృష్ట్యానే తెలుగుదేశం వారికి వంద సీట్లు ఇస్తామంటోందని, కాంగ్రెస్ కూడా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని సోనియాగాంధీని కోరతానని అన్నారు.

రత్నగిరి ప్రాజెక్ట్‌కు కేటాయించిన గ్యాస్‌ను మన రాష్ట్రానికి తిరిగి తీసుకురాకుంటే గ్యాస్ సరఫరా పైపులను ప్రజలు ధ్వంసం చేస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను మన అవసరాలకు వినియోగించకుండా వేరే రాష్ట్రానికి తరలిస్తుంటే అధికార పక్ష నేతలు మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి విజ్ఞతతో వ్యవహరించి ఉంటే గ్యాస్ మళ్లిం పు ఆగిపోయేదన్నారు. సుశీల్ కుమార్ షిండే తన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించి గ్యాస్‌ను తరలించుకుని వెళ్ళారని చెప్పారు.

English summary

 Congress Rajyasabha member V Hanumanth Rao has blamed YS Rajasekhar Reddy for the supply of gas to Ratnagiri plant of Maharastra. He said that union minister S Jaipal Reddy will be felicitated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X