వారి పేర్లు చెప్పండి: జగన్ పార్టీకి మంత్రి పితాని సవాల్

జగన్ పార్టీకి సిద్ధాంతాలు ఏమీ లేవని విమర్శించారు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమల వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జెండాపై దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ, దానిచుట్టూ కాంగ్రెస్ పథకాలను చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. తరచూ ఏదో ఒక నినాదంతో ఆందోళనలు, ధర్నాలు చేయడం వారికి నిత్యకృత్యమైందన్నారు.
ఇదే విధానాన్న్ని కొనసాగిస్తే జగన్ పార్టీ త్వరలోనే కుప్పకూలడం ఖాయమన్నారు. వైయస్ బొమ్మ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోబోమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా పితాని దుయ్యబట్టారు. గత ఉప ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వందస్థానాలు బిసిలకు కేటాయిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన గిమ్మిక్కులను నమ్మే స్థాయిలో ప్రజలు లేరన్నారు.
అన్ని కులాలకు సమానంగా అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమిచ్చేది తమ పార్టీయేనన్నారు. మరికొన్ని అభివృద్ధి పథకాలను కూడా ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టంకడుతారన్నారు.












Click it and Unblock the Notifications