గుజరాత్ ముఠా వలలో పడిన తెలుగు అమ్మాయి

Tanduru girl in Guajarat gang captivity
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక గుజరాత్ ముఠా నుంచి తప్పించుకుని వచ్చింది. మాయమాటలు చెప్పి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు. అంగీకరించకపోవడంతో ఆమెను బెల్టుతో కొట్టి చిత్రహింసల పాలు చేశాడు. జిల్లా మహిళల హక్కుల సంక్షేమ సంస్థ అధ్యక్షురాలు వరలక్ష్మి, బాలిక తల్లి ఆదివారం తాండూరులో మీడియా ప్రతినిధులకు ఆ వివరాలు వెల్లడించారు.

వారు చెప్పిన వివరాల ప్రకారం - తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన బాలికకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో పట్టణంలోని తెలిసినవారి ఇళ్లలో పాచిపని చేస్తోంది. పట్టణానికి చెందిన పెద్ద ఫాతిమా అనే మహిళ వీరి పేదరికాన్ని గుర్తించి బాలిక కుటుంబానికి చేరువైంది. నెల రోజుల కిదంట నేరుగా ఆమె తల్లిని, బంధువులను కలిసింది. గుజరాత్‌లో కారు, బంగ్లా ఉండి, బాగా చదువుకున్న యువకుడితో అమ్మాయి పెళ్లి చేయిస్తానని, పైసా కట్నం అవసరం లేదన, పెళ్లి కొడుకంటూ ఓ ఫొటో చూపించింది. దానికి అమ్మాయి తల్లి, బంధువులున అంగీకరించారు.

పెద్ద ఫాతిమా గుజరాత్‌కు చెందిన దినేష్ అనే 40 ఏళ్ల యువకుడిని బాలిక ఇంటికి తీసుకుని వచ్చింది. దినేష్ తలకు విగ్గు పెట్టుకుని ఉన్నాడు. ఫొటోలో ఉన్న యువకుడు కాదని గుర్తించింది. దాంతో పెళ్లి వద్దని బాలిక భావించింది. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసిన పెద్దలు బలవంతంగా జులై 5వ తేదీన వివాహం జరిపించేశారు. బాలిక వెంట తల్లి కూడా గుజరాత్ వెళ్లింది.

అయితే, గుజరాత్‌లో దినేష్ ఇల్లు పాడపడిన కొంపలా ఉంది. దినేష్‌కు చెందిన వ్యక్తులు బాలిక తల్లిని బలవంతంగా తిరుగు ప్రయాణం కట్టించారు. దినేష్ చేతిలో బాలిక చిత్రహింసలు అనుభవించింది. మొదటి భార్యను పక్కనే పెట్టుకుని బాలికను అనుభవించాడు. ఆ దృశ్యాలను చూసి మొదటి భార్య ఆనందించేది. చివరగా ఆమెను వ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేశారు. ఆమె తిరస్కరించడంతో బెల్టుతో కొట్టడం ప్రారంభించారు.

తమ్ముడికి రాఖీ కట్టి వస్తానని, ఆ తర్వాత మీరు చెప్పినట్లు వింటానని బాలిక నమ్మబలికింది. దినేష్‌‍ను తనతో పాటు రావాలని అడిగింది. దినేష్ ఆమెతో పాటు తాండూరు వచ్చాడు. ఇక్కడి పరిస్థితి గమనించిన పెద్ద ఫాతిమా పారిపోవాలని దినేష్‌కు సూచించింది. దీంతో దినేష్ గుజరాత్ పారిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+