• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జీవ ఆనవాళ్ల కోసం అంగారకుడిపై దిగిన క్యూరియాసిటీ

By Srinivas
|

Mars Rover Curiosity
కాలిఫోర్నియా: నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించన క్యూరియాసిటీ రోవర్ సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. ఈ రోవర్ అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను పసిగట్టనుంది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని జెట్ ప్రొపుల్షన్ లాబరేటరీలోని మిషన్ కంట్రోలర్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోవర్ గ్రహంపై దిగినట్లుగా సంకేతాలు అందాయని చెప్పారు.

ఈ ప్రయోగం చాలా క్లిష్టమైందని నాసా పేర్కొంది. ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. గత సంవత్సరం నవంబర్ 26వ తేదిన కాలిఫోర్నియాలోని అంతరిక్ష కేంద్రం నుండి క్యూరియాసిటీ రోవర్‌ను ప్రయోగించారు. ఈ రోజు అది నిర్దేషిత గేల్ బిలంలో విజవంతంగా దిగింది. క్యూరియాసిటీ దిగిందనే సంకేతాలు రాగానే నాసా శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. అణు ఇందనంతో పని చేసే ఈ రోవర్ కారు పరమాణంలో ఉంటుంది.

అంగారక గ్రహంపై జీవాన్ని గుర్తించి అక్కడ జీవం ఉండేందుకు అనుకూలంగా ఉంటుందా అనే విషయాన్ని పసిగట్టనుంది. 900 కిలోల బరువు ఉన్న ఈ రోవర్ అంగారక గ్రహంపై దిగడం సులభమేమీ కాదు. గంటకు దాదాపు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే వ్యోమనోకను కేవలం ఏడు నిమషాలలోనే అరుణ గ్రహం పైకి సురక్షితంగా దించాలి. ఈ ప్రక్రియ విజయవంతమైంది.

క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై రెండేళ్ల పాటు పరిశోధన చేయనుంది. అక్కడి నుండి ఫోటోలు పంపిస్తుంది. ఈ రోవర్ 1540 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి అంగారకుడిపై దిగింది. ఇప్పటి వరకు నాసా శాస్త్రవేత్తలు కేవలం తక్కువ బరువు ఉండే రోవర్‌లను పంపించారు. అవి కూడా కేవలం మూడు నెలలు మాత్రమే అక్కడ పని చేసేవి. కానీ ఈ క్యూరియాసిటీ మాత్రం అందుకు విభిన్నం. ఇది 900 కిలోల బరువైనదే కాకుండా.. రెండు సంవత్సరాల పాటు పని చేస్తుంది.

క్యూరియాసిటీ కోసం అయిన ఖర్చు రూ.13,700 కోట్లు. గతంలో నాసా పంపించిన రోవర్‌ల కంటే ఇది పదిరెట్లకు పైగా అధికంగా పని చేస్తుంది. దీనిని అంగారకుడి పైకి ప్రయోగించే ముందు శాస్త్రవేత్తలు అంగారకుడి తరహా వాతావరణాన్ని భూమి మీద సృష్టించి దానిని పరీక్షించారు. ఆ తర్వాతే ప్రయోగించారు. కాగా ఈ తరహా ప్రయోగాలకు భారత ప్రభుత్వం కూడా ఇస్రోకు పచ్చజెండా ఊపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Mars science rover Curiosity landed on the Martian surface shortly after 10.30pm Pacific time on Sunday (1.30am EDT Monday/0530 GMT) to begin a two-year mission seeking evidence the Red Planet once hosted ingredients for life, Nasa said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more