హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దక్కన్ క్రానికల్‌కు షాక్: బ్యాంక్ ఖాతాల అటాచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Deccan Chronicle
హైదరాబాద్: దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డిసిహెచ్ఎల్)కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాదు, చెన్నైల్లోని దక్కన్ క్రానికల్ బ్యాంక్ ఖాతాలను ఆటాచ్ చేస్తూ ఢిల్లీలోని డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు ఈ నెల 2, 3 తేదీల్లో రెండు ఉత్తర్వులను జారీ చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

ఆ ఉత్తర్వుల ద్వారా దక్కన్ క్రానికల్‌కు చెందిన హైదరాబాదులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాలను, చెన్నైలోని ఐసిఐసిఐ బ్యాంకు ఖాతను అటాచ్ చేశారు. ఈ ఏడాది జూన్‌లోగా 25 కోట్ల రూపాయల డిబెంచర్స్‌ నాన్ కన్వర్టబుల్‌కు సంబంధించి భారత పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ (ఐఎఫ్‌సిఐ) దాఖలు చేసిన పిటిషన్ మేరకు డిఆర్‌టి ఆ ఆదేశాలు ఇచ్చింది.

మీడియా కథనాల ప్రకారం - విచారణ సందర్భంగా దక్కన్ క్రానికల్ ఎన్‌సిడిలపై ఐఎఫ్‌సిఐకి వడ్డీని చెల్లించిందని, 25 కోట్ల రూపాయల అసలుకు చెన్నైలోని ఐసిఐసిఐ బ్యాంకు చెక్ ఇచ్చింది. అయితే ఆ చెక్కు చెల్లలేదు. డిసిహెచ్‌ఎల్ ప్రవర్తన సరిగా లేదని, తన షేర్ హోల్డింగ్సును, ఎంక్యుంబరింగ్ అస్తులను బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సి వంటి రుణదాతల పేరు మీదికి మారుస్తుందని డిఆర్‌టి అభిప్రాయపడింది.

కాగా, ఐసిఐసిఐ బ్యాంకు డిఆర్‌టికి దరఖాస్తు పెట్టుకుంది. తమ వద్ద ధరావత్తు పెట్టిన సెక్యూరిటీలకు రక్షణ కల్పించి, తమ పిటిషన్‌ను విచారించాలని ఐసిఐసిఐ కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 8వ తేదీకి వాయిదా పడింది.

English summary

 In a setback for Deccan Chronicle Holdings Ltd (DCHL), the Debts Recovery Tribunal (DRT) in New Delhi has attached five accounts of the company with various banks in Hyderabad and Chennai through two orders issued on August 2 and 3, 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X