జగన్ ఎంపీ మేకపాటి తెలుగులో, అఖిలేష్ వైఫ్ హిందీలో

సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరా కుమార్ ఎంపీలుగా ఎన్నికైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, సమజ్‌వాది పార్టీ ఎంపి డింపుల్ యాదవ్‌లచేత ప్రమాణ స్వీకారం చేయించారు. మేకపాటి తెలుగులో ప్రమాణ చేయగా, డింపుల్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మేకపాటి విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. తాము ఏ పార్టీలో కలిసే ప్రసక్తి లేదని, మిగతా పార్టీల వారే తమ పార్టీలో కలుస్తారని జోస్యం చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆత్రుత తమకు ఏమాత్రం లేదన్నారు. తమ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్లాలలో కూడా పోటీ చేసే అవకాశముందని చెప్పారు.
తన గెలుపుకు ప్రతి ఓటరు కార్యకర్తలా పని చేశారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నెల్లూరు రైలు ప్రమాదంపై జీరో అవర్‌లో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పని తీరు అసమర్థంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications