అన్యమతస్తులకు డిక్లరేషన్, ప్రచారంపై పరిపూర్ణానంద

హైందవేతరులు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో శ్రీవారిపై విశ్వాసం ఉన్నట్లు అంగీకరిస్తూ సంతకం చేయాలనే నిబంధన ఉందని వివరించారు. తిరుమల శ్రీవారిని దర్శించే హిందూయేతర మతాలకు చెందిన వారు ఇక నుంచి తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిక్లరేషన్‌పై సంతకం చేయని అన్య మతస్తులు, సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి దర్శనానికి అనుమతించబోమన్నారు.
అన్యమత ప్రచారంపై చర్యలు తీసుకోండి.. పరిపూర్ణానంద
మరోవైపు తిరుమల, కాళహస్తి, శ్రీశైలం వంటి హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద సరస్వతి విజ్ఞప్తి చేశారు. దేవాలయ పరిసరాల్లో అన్యమత ప్రచారాలు నిర్వహించకూడదనే జీవో ఉన్నా అవి అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ రక్షావేదిక అధ్యక్షుడు ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటుగా మంగళవారం ఆయన సిఎంను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
హిందూ దేవాలయాల్లో అన్ని స్థాయిల్లోనూ హిందువులే సేవకులుగా ఉండాలని సిఎంకు చెప్పామన్నారు. తిరుమలలో వెంకటేశ్వరుని తల్లి వకుళాంబ దేవాలయ పరిస్థితి దయనీయంగా ఉందని, దానిని పునర్నిర్మించాల్సిందిగా సిఎంను కోరామన్నారు. అన్యమత ప్రచారం, మతాంతీకరణలపై ఉన్న చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, లేకుంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.












Click it and Unblock the Notifications