• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎయిర్ హోస్టెస్ గీతిక సూసైడ్:మంత్రి అరెస్ట్‌‌కు అవకాశం

By Srinivas
|

Geetika - Gopal Kanda
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు గోపాల్ కందాకు మంగళవారం నోటీసులు పంపించారు. అతను ఏ క్షణమైనా పోలీసు హెడ్ క్వార్టర్‌లో విచారణకు హాజరయ్యే అవకాశముంది. ఈ కేసులో కందాతో పాటు అరుణ చద్దాను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

అరుణ చద్దా.. కందా యొక్క డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌ ఎండిఎల్ఆర్‌లో ఉద్యోగి. ఇప్పటికే పోలీసులు మంగళవారం ఉదయం చద్దాతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను ప్రశ్నించారు. కందాను కూడా గీతిక ఫోన్‌లో దొరికిన కాల్ డిటెల్స్‌ను బట్టి ప్రశ్నించనున్నారని అంటున్నారు. ఈ కేసు విషయంలో కందా పైన పోలీసులు తాజాగా ఛార్జీషీట్ కూడా దాఖలు చేశారు. మరోవైపు కందా మాత్రం తాను గత కొంతకాలంగా గీతికతో మాట్లాడలేదని చెబుతున్నారు. అయితే వెరిఫికేషన్ కోసం తన ఫోన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమని చెప్పారు.

అంతేకాకుండా గీతికకు ఇచ్చిన డబ్బులు కూడా లోన్ రూపంలో మాత్రమే ఆమె చదువు కోసమే ఇచ్చానని కందా చెబుతున్నారు. గీతిక కుటుంబ సభ్యులు కొన్ని ఫొటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలను బట్టి గీతికా శర్మతో రాజీనామా చేసిన మంత్రి గోపాల్ గోయల్ కందాకు అత్యంత సాన్నిహిత్యం ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. వారిద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను గీతికా శర్మ కుటుంబ సభ్యులు విడుదల చేశారు.

గీతికా శర్మ కందాకు ఉద్యోగిని మాత్రమే కాదని, వారిద్దరు వ్యక్తిగత సంబంధాలను కూడా సాగించారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే, ఆ ఆరోపణలను కందా ఖండించారు. తాను నడిపే ఎండిఎల్ఆర్ మాజీ ఉద్యోగి మాత్రమేనని, గీతికతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అంటున్నారు. గీతిక, కందా కలిసి షిర్డీ, ముంబై వంటి పలు ప్రదేశాలను సందర్శించినట్లు ఆమె కుటుంబ సభ్యులు విడుదల చేసిన ఫొటోలు తెలియజేస్తున్నాయి.

కందా చేసిన ఫొన్‌లు గీతికకు ప్రశాంతత లేకుండా చేశాయని, దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గీతిక కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇటీవలి కాలంలో తాను గీతికకు ఫోన్ చేయలేదని, కావాలంటే తన ఫోన్ కాల్స్‌ను పరిశీలించుకోవచ్చునని కందా అంటున్నారు. గీతిక చదువు కోసం తాను అప్పుగానే ఇచ్చానని ఆయన చెప్పారు. గీతిక అత్యంత సన్నిహితంగా ఉండడం వల్లనే కందా ఎంబిఎ చదవడానికి ఏడు లక్షల రూపాయలు ఇచ్చాడని గీతిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గీతికకు కందా బిఎండబ్ల్యు ఇచ్చారని, అయితే కొన్నాళ్లు వాడుకుని గీతిక తిరిగి ఇచ్చేసిందని అంటున్నారు.

పై చదువుల కోసం తాను గీతికకు ఏడున్నర లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా సిర్సాలో నడిచే తన అంతర్జాతీయ స్కూల్ ట్రస్టు చైర్మన్‌గా కూడా చేశానని కందా అంటున్నారు. ఆ తర్వాత ఆమెతో తనకు సంబంధాలు లేవని చెబుతున్నారు. కొత్త పరిణామం గీతిక మృతి కేసు దర్యాప్తులో పోలీసులకు ఉపయోగపడవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు గీతిక ల్యాప్‌టాప్‌ను, మొబైల్ ఫోన్లను దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఫ్లాట్‌లో కందా, గీతికలకు సంబంధించిన కొన్ని ఫొటోలు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు.

గీతికా శర్మ ఆత్మహత్యతో హర్యానా హోంశాఖ సహాయ మంత్రి గోపాల్ కందా ఆదివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన నిర్వహించిన విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిన ఇరవై మూడేళ్ల గీతికా శర్మ శనివారం రాత్రి ఢిల్లీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ మానసిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది.

English summary
Wednesday, Aug 8 seems to be a crucial day for former Haryana minister Gopal Kanda as sources informed that he might be grilled and arrested soon in connection with the suicide case of Geetika Sharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X