రెచ్చగొడితే గుండెల్లో నిద్రపోతాం: చంద్రబాబు ఫైర్

అవినీతికి వరద గేట్లు తెరవడం వల్లనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతోందని ఆయన విమర్శించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని యధాతథంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు.
రేపటిలోగా ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులతో కలిసి ఎల్లుండి నుంచి పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. అందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫీజులు చెల్లించే స్థితిలో తల్లిదండ్రులు లేరని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎంత ఫీజు నిర్ణయిస్తే అంత ఫీజు ప్రభుత్వం చెల్లించాలని ఆయన అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింజేస్తామని ఆయన చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హైదరాబాదులో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, నిజాంపట్నం ఆటవిక రాజ్యంగా మారుతోందని, ఇది మరో పులివెందుల మాదిరిగా తయారవుతోందని చంద్రబాబు అన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పేదల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకునేవారిపైనే తమ పోరాటమని ఆయన అన్నారు. రైతులపై కేసులో పెడితే సహించబోమని, రెచ్చగొడితే గుండెల్లో నిద్రపోతామని ఆయన అన్నారు. తమ పోరాటం రైతుల పక్షాననే అని ఆయన అన్నారు. వాన్‌పిక్‌కు 29 వేల ఎకరాలు ఎందుకు ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం బీసీలకు కోత పెట్టే ఆలోచన చేస్తోంది. ఫీజుల రీయంబర్స్‌మెంట్‌కు పరిమితి విధించాలని చూస్తోంది. దీంతో అన్ని వైపుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications