మంత్రిగా ఉండి ఇలాగా: దానంపై సొంత పార్టీ నేతల ఫైర్

హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇస్కాన్ సంస్థ చేస్తున్న కృషి అమోఘమన్నారు. మంచి పేరున్న ఇలాంటి సంస్థకు వ్యతిరేకంగా పోరాడటం దానంకు సరికాదన్నారు. దానం ఓ మంత్రిగా ఉండి ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడమేమిటని ప్రశ్నించారు. పోలీసులు కూడా అత్యుత్సాహాన్ని మానుకోవాలని పాల్వాయి సూచించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెసు పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని రంగారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు వ్యాఖ్యలు చేసినట్లుగా తాము భావించడం లేదన్నారు. దానం విషయాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని చెప్పారు. త్వరలోనే ఈ వివాదం ముగుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇప్పటికే ఈ అంశంపై స్పందించారని చెప్పారు.
కాగా మంత్రి దానం నాగేందర్ బంజారాహిల్స్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం భూమిని ఇస్కాన్ సంస్థకు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పైన ధ్వజమెత్తారు. అదే సమయంలో తాను బిసిననే అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications