హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రూప్-4 పరీక్షలు: విజయమ్మ దీక్ష ఒకరోజు వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని నీరుగారుస్తుందంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేయతలపెట్టిన దీక్ష ఒకరోజు వాయిదా పడింది. ఇందుకు ఎపిపిఎస్సీ పరీక్షలు ఉండటమే కారణం. వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13వ తేదీలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తొలుత దీక్షను తల పెట్టింది.

12వ తేదిన గ్రూప్-4 పరీక్షలు ఉన్నాయి. విజయమ్మ చేపట్టిన దీక్ష విద్యార్థులకు సంబంధించినది కాబట్టి ఎపిపిఎస్సీ పరీక్షలు జరిగే రోజే దీక్ష చేపట్టడం సరికాదని భావించిన పార్టీ దానిని ఒక రోజుకు వాయిదా వేసింది. దీంతో 13, 14వ తేదీలలో విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో దీక్ష చేపట్టనుంది. విజయమ్మ దీక్ష తేదీలలో మార్పును పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం ప్రకటించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన తర్వాత పార్టీని బలోపేతం చేసే బాధ్యత వైయస్ విజయమ్మ పైన పడింది. అప్పటి నుండి ఆమె ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని చూస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికుల కోసం దీక్ష చేపట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party honorary president and Pulivendula MLA YS Vijayamma puts off dharna at Eluru of West Godavari district to August 13, 14 to avoid clash with Group-4 exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X