వాన్‌పిక్ భూములను దున్నిన టిడిపి అధినేత బాబు

రైతులు కమిటీలుగా ఏర్పడి వాన్‌పిక్ భూములను దున్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాన్‌పిక్ భూములు తిరిగి రైతులకు చేరే వరకు తన పోరాటం ఆపబోనని ఆయన చెప్పారు. తాను పాదయాత్ర చేస్తుంటే పైన హెలికాప్టర్ తిరుగుతోందని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై చేయి వేస్తే ఖబడ్దార్ అని ఆయన హెచ్చరించారు. ఆయన వాన్‌పిక్ భూముల వరకు కూడా పాదయాత్ర చేశారు.
మంత్రులు శాసనసభ్యులు రౌడీల మాదిరిగా పేద రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపించారు. తెలియకుండానే ప్రముఖులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాన్‌పిక్ ప్రాజెక్టును సమర్థిస్తున్నారని, ఇది సిగ్గు చేటు అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, కాంగ్రెసుపై ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు రెండో రోజు శుక్రవారం ప్రకాశం జిల్లాలోని దేవరంపాడు, పత్తిపాడు గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు పలికారు.
గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం నిమ్మగడ్డ ప్రసాద్‌కు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాలు కేటాయించారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి సిబిఐ నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా జైలు పాలయ్యారు. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ వాన్‌పిక్ భూముల కేటాయింపుపై దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications