కృష్ణా నదిలో ఆరుగురు విద్యార్థులు గల్లంతు

ఒడ్డుకు చేరుకున్న విద్యార్ధులు కేకలు వేయడంతో అక్కడ ఉన్నవారు విషయం తెలుసుకుని నదిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు నదికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కూడా సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. రత్న, పండు, బాబు, రవితేజ, ఫణి, సూర్య అనే విద్యార్థులు గల్లంతైనట్లు తెలుస్తోంది.
కడప జిల్లాలోని దువ్వూరు మండలం కనగూడూరు దగ్గర శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇండికా కారు- లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిని కర్నూలు జిల్లా శ్రీనగర్ వాసులుగా గుర్తించారు. కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వరంగల్ జిల్లాలోని హన్మకొండ విజయ టాకిస్ రోడ్డులో కిషన్ రెడ్డి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తి కిషన్‌రెడ్డిని దారుణంగా నరికి చంపారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్నేహితులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications