హిందీ నేర్పిన జుందాల్‌ను ఈజీగానే గుర్తు పట్టిన కసబ్

ఇద్దరినీ కలిపి ప్రశ్నించారు. జుందాల్‌ను కసబ్ ఈజీగానే గుర్తుపట్టాడు. ముంబై ముట్టడి కుట్రదారుల్లో జుందాల్ కూడా ఉన్నాడని కసబ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లష్కరే తాయి బా ఉగ్రవాది జుందాల్‌ను ఈ ఏడాది మేలో పోలీసులు పట్టుకున్నారు. జుందాల్ చెప్పిన విషయాలపై కసబ్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కసబ్‌ను జుందాల్‌ను కలిపి ప్రశ్నిస్తున్నారు.
జుందాల్‌ను కసబ్ ఈజీగానే గుర్తు పట్టాడని ముంబయి పోలీసు ఒకరు చెప్పారు. వీరిద్దరినీ ముఖామఖిగా ముంబయి క్రైం బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్‌లో విచారించినట్లు చెప్పారు. తమ పదిమందికి ఇతనే హిందీ నేర్పించాడని కసబ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా లక్ష్య నిర్దేశన పైన కూడా పాఠాలు చెప్పాడని తెలుస్తోంది. వీరిద్దరిని ఎదురుగా ఉంచి విచారించేందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతించింది.












Click it and Unblock the Notifications