హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhadriraju Krishnamurti
హైదరాబాద్: ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు 84 ఏళ్లు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు.

ద్రావిడ భాషా శాస్త్రవేత్తగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. గత శతాబ్ద కాలంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో ద్రావడి భాషా పరిశోధన చేసి ద్రావిడ భాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను సంపాదించి గట్టి పునాది వేసినవారిలో ఆయన ముఖ్యులు.

భద్రిరాజు కృష్ణమూర్తి 2003లో రచించిన ద్రావిడియన్ లాంగ్వేజెస్ గ్రంథం గత రెండు శాతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధినిన సాధికాకరికంగా చర్చిస్తుంది. అది వర్తమాన తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఝులకు ప్రామాణిక గ్రంథంగా నిలిచింది. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు సాహిత్య, భాషా శాస్త్ర విభాగాల్లో ఆయన రచించిన భాషాధ్యయన గ్రంథమే పాఠ్యంగా దశాబ్దాలుగా ఉంటూ వస్తోంది.

ద్రావిడ భాషథా తత్వం గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాషథ నవీకరణ గురించి ఆయన ఎన్నో పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రచించారు. భద్రిరాజుకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆయన 1928 జూన్ 19 తేదీన జన్మించారు.

భద్రిరాజు 1985లో అమెరికా లింగ్విస్టిక్ సొసైటీ సభ్యుడిగా ఉన్నారు. న్యూఢిల్లీ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వివిధ విశ్వవిద్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. పలు సత్కారాలు, హోదాలు పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు దక్కింది.

English summary
Bhadriraju Krishnamurti (born 19 June 1928) is an eminent Dravidianist and most respected Indian linguist of his generation. He was born in Ongole (Andhra Pradesh). He was Vice Chancellor of Hyderabad Central University from 1986 to 1993. He founded the Department of Linguistics at Osmania University, where he then would serve as professor from 1962 to 1986.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X