వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరు చెడగొట్టుకోవద్దు: సిఎంకు పాల్వాయి సూచన

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: ఇప్పటి వరకు ఉన్న మంచి పేరును చెడగొట్టుకోవద్దని కాంగ్రెసు సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఆయన శనివారం తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసి పోలవరం ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రద్దు చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని ఆయన అన్నారు. పోలవరం ద్వారా రాయలసీమకు, తెలంగాణకు 45 టిఎంసిల నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అవి తీసుకోవడానికి తాము ఏమైనా బిక్షగాళ్లమా అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఏమయ్యాయని ఆయన అడిగారు.

పోలవరం టెండర్లలో 600 కోట్ల రూపాయలను పార్టీలన్నీ పంచుకున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నీటి పారుదల ఇంజనీర్లపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు బూటకమని, దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులకు కనీస అవగాహన లేదని ఆయన అన్నారు.

జలయజ్ఞం పేరుతో కాంగ్రెసు ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టులో ఎల్లూరు ఎత్తిపోతల పనులను జిల్లా శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి, రాములు, తదితరులతో కలిసి పరిశీలించారు.

నాటి వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ప్రాజెక్టుల పేరుతో రాష్టాన్ని లూటీ చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అంచనాలు పెంచి నిలువునా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆయన అన్నారు. మంత్రి సుదర్శన్ రెడ్డి శాసనసభ్యులకు కూడా చెప్పకుండా దొంగలా ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
Congress senior leader and Congress Telangana region Rajyasabha member Palvai Govardhan Reddy has opposed CM Kiran kumar Reddy's statement on Polavaram project. He suggested CM not make hasty decissions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X