మొగుడే కానీ మగాడు కాదట: ఓ మహిళ ఆరోపణ

Hyderabad
హైదరాబాద్: తనను మనసు పడి మనువాడిన మగడు.. మగాడే కాదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన భూమమ్మ, సుద్దయ్య దంతుల కూతురు సునీత అలియాస్ కల్పన (25). ఆమెకు ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న చేగూరి మారుతీవరప్రసాద్(30)తో పది నెలల క్రితం పరిచయమైంది. ఇద్దరి మనసులూ కలవడంతో ఉప్పల్ శ్రీ వెంకటేశ్వరాలయంలో ఇరు వర్గాల పెద్దల సమక్షంలో గత అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు.

పెళ్లయి నెలలు గడిచిపోతున్నా భర్త కాపురానికి ససేమిరా అంటుండంతో సునీత అతడిని నిలదీసింది. తన ఆరోగ్యం బాగుండడం లేదని మందులు వాడుతున్నానని ఆరు నెలలు గడువిస్తే అంతా కుదుటపడుతుందని మారుతి తొలుత తన భార్యకు నచ్చజెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె తన మనసుకు సర్దిచెప్పుకొంది. కానీ, మారుతి ఇంట్లో ఉన్నప్పుడు ఆడ వేషధారణతో అలంకరించుకుంటూ వింతవింతగా ప్రవర్తిస్తుండమే కాకుండా ఇలా ఉండడమే తనకిష్టమని చెప్పడంతో విస్తుపోయింది.

"నీ కోరికలు నా స్నేహితులు తీరుస్తారు'' అని కట్టుకున్న భర్తే చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. చేసేది లేక భర్త తీరును అత్త సరళ దృష్టికి తీసికెళ్లగా తన కొడుకు పరిస్థితి అంతేనని, అతడు చెప్పినట్లు నడుచుకోమంటూ చెప్పడంతో తనకు న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయించింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో చెప్పింది. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు.

మనసు పడి పెళ్లి చేసుకున్న మగవాడి పరిస్థితి అలా కావడంతో ఆ మహిళ తీవ్ర ఆవేదనకు గురవుతోంది. తనతో కాపురం చేసి సుఖపెట్టాల్సిన వ్యక్తి స్త్రీ మాదిరిగా అలంకరించుకుంటూ చీరలు, పూవులు పెట్టుకుంటూ ఉంటే చూడలేకపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+