ఇరాన్‌లో రెండు భారీ భూకంపాలు: 250మంది మృతి

రిక్టర్ స్కేలు పైన 6.2, 6.0గా నమోదయ్యాయి. భూకంప కేంద్రం రాజధాని నగరం టెహ్రాన్‌కు సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని అహర్, హరీస్, ప్రాంతాలలో గుర్తించారు. ఈ రెండు భూకంప కేంద్రాలు భూమికి పది కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి. చాలా గ్రామాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. గాయపడ్డ వారిని తాబ్రీజ్, అర్దెబిల్ ఆసుపత్రులకు తరలించారు.
భూకంప ప్రకంపనలతో జనం భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల దాటికి అహర్, హరీస్, వర్జాఖాన్ పట్టణాలు అతలాకుతలమయ్యాయి. అరవై గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా తుడిచి పెట్టుకు పోయాయి. మహిళలు, పిల్లల మృతదేహాలు గుంపులుగా పడి ఉన్నాయి. తాబ్రిజ్ నగరంలో భవనాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి.












Click it and Unblock the Notifications