హైకోర్టులో శ్రీలక్ష్మికి చుక్కెదురు: బెయిల్ నిరాకరణ

నిందితులు బయటకు వస్తే కేసును తారు మారుచేసే అవకాశం ఉందని సిబిఐ తరఫు న్యాయవాది వాదించడంతో కోర్టు ఈ మేరకు బెయిల్ పిటిషన్‌నను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా శ్రీలక్ష్మి చెంచల్‌గూడ మహిళ జైళ్ల విభాగంలో ఉన్న విషయం తెలిసిందే.
ఒఎంసి కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు 2011 డిసెంబర్ 1వ తేదీన అరెస్టు చేశారు. చంచల్‌గుడాలోని మహిళా జైలుకు వచ్చిన ఆమెకు మరుసటి రోజే బెయిల్ లభించింది. దీంతో ఆమె బయటకు వచ్చారు. అయితే హైకోర్టు ఆమె బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆమె 2012 జనవరి 6వ తేదీన కోర్టులో లొంగిపోయారు.
దాంతో ఆమె మళ్లీ చంచల్‌గుడాలోని మహిళా జైలుకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒఎంసికి గనుల లీజుకు ఇచ్చిన జీవోలో కాప్టివ్ అనే పదాన్ని తొలిగించడంతో ఆమె ఇరకాటంలో పడ్డారు. అయితే, వ్యవహారంలో ఆమె అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తప్పు పట్టారు. సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ విచారించింది.












Click it and Unblock the Notifications