• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిబిఐ జెడి కాల్ లిస్టు లీక్ కేసు: కెవి రెడ్డికి బెయిల్

By Pratap
|

JD Lakshminrayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డు (సిడిఆర్) లీకు కేసులో అరెస్టయిన కె వెంకటరెడ్డి అలియాస్ కెవి రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హారాష్ట్రలోని నాదేండ్‌ పోలీసులను తప్పుదారి పట్టించి కెవి రెడ్డి ఈ కాల్ డేటా రికార్డులను సంపాదించినట్లు సిఐడి విచారణలో తేలింది. దీంతో కెవి రెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చింది. కాగా, ఇదే కేసులో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావుకు కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది.

మహారాష్టక్రు చెందిన కె.వెంకట్‌రెడ్డి అలియాస్ కెవిరెడ్డిని సిఐడి అధికారులు జూలై 26వ తేదీన అరెస్టు చేశారు. మహారాష్టల్రోని ఇంద్ భరత్ ఇంజినీర్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వెంకట్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. జెడి కాల్ లిస్టును బయటకు తీయడంలో వెంకటరెడ్డి సహకరించినట్లు గుర్తించడంతో అరెస్టు చేయగా, నిందితుడిపై ఐపిసి 120 బి, 420, 166, 167, 218, 201, 500, 509, ఐటి చట్టం 2000 సెక్షన్ 43 (జి) 84 (సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా కరబ్‌ఖాండ్ గ్రామంలో ఇంద్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్ అనే సంస్థకు రఘురాజు చైర్మన్‌గా ఉన్నారు. అదే సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కెవి రెడ్డి ద్వారా జెడి కాల్ లిస్ట్‌ను సేకరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన మిక్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ ఎంవి రమణ రావు, రఘురాజు మధ్య పరిచయం ఉంది. రమణారావు ద్వారా నాగపూర్ టెలికం అధికారి అయిన హనుమంత రావును సంప్రదించి... జెడి సెల్ నంబరు సహా మొత్తం 3 సెల్‌ఫోన్ల నంబర్ల కాల్‌డేటా కావాలని అడిగారు.

ఈ క్రమంలో.. విజయవాడ బిఎస్ఎన్ఎల్ ఐటీఎస్ డైరెక్టర్ రామకృష్ణ నుంచి జెడి కాల్ డేటా కోసం అబిడ్స్‌లోని భారత్ సంచార్ భవన్ (టెలికం ఆఫీస్)లో అదనపు జనరల్ మేనేజరు (ఆపరేషన్స్) రవిచంద్రకు ఈ-మెయిల్ వెళ్లింది. రామకృష్ణ తమ శాఖ అధికారే కావడంతో... రవిచంద్ర జెడి కాల్ డేటా ఇచ్చారు. తర్వాత.. ఆ లిస్ట్ బిఎస్ఎన్ఎల్ నోడల్ అధికారి(హైదరాబాద్) బాల్‌సింగ్ వద్దకు చేరింది.

ఆ లిస్ట్ తీసుకుని పంపాలని నాగ్‌పూర్ బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారి కె.హనుమంత రావు తనకు ఎస్ఎంఎస్ చేసినట్లు రామకృష్ణ సిఐడి అధికారులకు తెలిపారు. ఆయన ఆ లిస్ట్‌ను హనుమంత రావుకు అందించారు. అదే జాబితా హనుమంతరావు ద్వారా కెవి రెడ్డికి, అక్కడి నుంచి రఘురాజుకు అందింది. దీని ఆధారంగానే జెడిపై రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత జగన్ మీడియా ద్వారా కాల్‌లిస్ట్‌ను కూడా బయటపెట్టారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
KV Reddy got bail in CBI JD Lakshminrayana CDR leak case, CID has taken Indu Bharath representative KV Reddy into its custody to grill in CBI JD Lakshminarayana CDR leak case. K Venkat Reddy alias KV Reddy has been arrested by CID on July 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more