హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డతో కలిసి మంత్రి ధర్మాన కుట్ర: సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nimmagadda Prasad-Dharmana Prasad Rao
హైదరాబాద్: వాన్‌పిక్ వ్యవహారంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌తో కలిసి మంత్రి ధర్మాన ప్రసాదరావు కుట్ర చేశారని సిబిఐ ఆరోపించింది. ధర్మాన ప్రసాదరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వాన్‌పిక్ కుట్రలో ఆయనకు భాగముందని సిబిఐ చార్జిషీట్‌లో ఆరోపించింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు ప్రయోజనం చేకూరే విధంగా నాలుగు జీవోలు జారీ చేశారని, ఆ జీవోలు జారీ చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారి బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించారని సిబిఐ తెలిపింది.

వాన్‌పిక్‌గానూ మొత్తం 6,776 ఎకరాల భూమిని కేటాయించారని, నిమ్మగడ్డకు కేటాయించిన భూమిపై పరిశ్రమల శాఖకు సమాచారం ఇవ్వలేదని, నిమ్మగడ్డకు అనుకూలంగానే మంత్రి పనిచేశారని సిబిఐ చార్జీషీటులో పేర్కొంది. వాన్ పిక్ పోర్టుకే కాకుండా వాన్‌పిక్ ప్రాజెక్టుకు మేలు చేకూరేలా మంత్రి ధర్మాన భూములు కేటాయించారని సిబిఐ ఆరోపించింది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి 'రస్ ఆల్ కైమా' ఇచ్చిన రూ. 450 కోట్లలో 150 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు చెల్లించారని, మిగతా 300 కోట్ల రూపాయలకు లెక్క తేలాల్సి ఉందని సిబిఐ తెలిపింది.

జిఎడి ముఖ్య కార్యదర్శిని కాదని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి మంత్రి ధర్మాన ఫైళ్లు పంపించారని, సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని సిబిఐ చార్జీషీట్‌లో పేర్కొంది. వైఎస్ హయాంలో ధర్మాన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా జగన్ అక్రమాస్తులు, వాన్‌పిక్ భూముల కేటాయింపు వ్యవహారం కేసులో 14 మందిని నిందితులుగా చేర్చుతూ సిబిఐ సోమవారం మధ్యాహ్నం 177 పేజీలతో కూడిన చార్జీ షీటును 9 సీల్ బాక్స్‌ల్లో పెట్టి నాంపల్లి కోర్టులో సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో ఏ-5గా మంత్రి ధర్మానను సీబీఐ పేర్కొన్న విషయం విదితమే.

భూముల కేటాయింపు విషయాన్ని ధర్మాన ప్రసాద రావు పెట్టుబడుల శాఖకు తెలియజేయలేదని సిబిఐ చెప్పింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ధర్మాన ప్రసాద రావు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
CBI has alleged that minister Dharmana Prasad Rao conspired with Nimmagadda Prasad in Vanpic. Dharmana Prasad Rao has issued GOs making undue favour to Nimmagadda Prasad Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X