ప్రజలు జయహో జగన్ అంటున్నారు: మేకపాటి

బయటకు వచ్చిన తర్వాత జగన్ తిరిగి నాయకత్వం వహిస్తారని, ప్రజలకు గొప్ప నాయకత్వాన్ని అందిస్తారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటును జగన్ పూరిస్తారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ దైర్యం, సాహసం, దృఢచిత్తం, ఔదార్యం ఉన్న నాయకుడని, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంట నడవాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి జగన్ ఉజ్వల భవిష్యత్తును అందించబోతున్నాడని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసి పరువు నిలుపుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పేద విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఏదో చేస్తున్నామంటూ మాటలు చెప్పిన ప్రభుత్వం ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలని ఆమె కోరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించే సత్తా ప్రభుత్వానికి లేకపోతే వెంటనే దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోరారు. వైయస్ విజయమ్మ పోరు దీక్షా శిబిరంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రసంగించారు.












Click it and Unblock the Notifications