హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖకు సై: తెలంగాణకు బాలకృష్ణ మద్దతు, ఏ బాధ్యతైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ బుధవారం అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణపై టిడిపి గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పారు. తన తనయుడు మోక్షజ్ఞ సినిమాలలోకి వస్తాడని చెప్పారు. అయితే అతను రావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని చెప్పారు.

తాను ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నానని చెప్పారు. పార్టీ బాధ్యత అప్పగిస్తే నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు. తెలంగాణపై టిడిపి కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఇప్పటికే పార్టీ కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు. తెలంగాణకు టిడిపి అనుకూలంగా ఉందని, అలా అని మరోసారి కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉందన్నారు. తమ పార్టీ ఇటీవల ప్రవేశ పెట్టిన బిసి డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆ వర్గాలు తమ పార్టీతోనే ఉంటాయని అన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని, అప్పుడే దేశంలో మార్పు సాధ్యమన్నారు. మంచిని మంచిగా చెడును చెడుగా చూడాలన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఆమోదించడం లేదని బాబు ప్రశ్నించారు.

అవినీతిని అరికట్టాలంటే యువత నడుం బిగించాలన్నారు. ఈ సందర్భంగా బాలు అనే నిజామాబాద్ జిల్లా వాసి పదిహేను రోజుల పాటు శ్రమించి తయారు చేసిన 10,566 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో వైయస్ విజయమ్మ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో నాయిని నరసింహా రెడ్డి, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డిలు జాతీయ జెండాను ఎగుర వేశారు.

English summary
Hero Nandamuri Balakrishna said on Wednesday that Telugudesam party is not against to Telangana statehood. He said his son Mokshagna will come in to Telugu industry soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X