హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ అగ్నిప్రమాదం, చికిత్స పొందుతూ ఒకరు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Fire Accident
మహబూబ్‌నగర్/హైదరాబాద్: హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు అగ్ని ప్రమాదాలు బుధవారం చోటు చేసుకున్నాయి. హైదరాబాదులో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించగా ఆగస్టు 15 కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పాలమూరు జిల్లాలోని షాద్‌నగర్‌లో స్టీల్ కోర్ పరిశ్రమలో ఉదయం సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా గాయపడ్డారు.

స్థానికులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పినప్పటికీ ఆరోగ్యం విషమంగానే ఉంది. గాయపడ్డ/మరణించిన వారంతా బీహార్ వలస కార్మికులు. గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన మరికొందరిని అత్యుత్తమ చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాదులోని జీడిమెట్లలో భారత్ హాల్ వెంచర్స్ అనే పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో నిల్వ ఉంచిన రసాయనాల డ్రమ్ము పేలి ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను ఆర్పి వేశాయి. సుమారు పది కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.

రసాయన డ్రమ్ములు పగిలి రోడ్ల పైకి రావడంతో జీడిమెట్ల అంతా పొగ వ్యాపించింది. ఈ కంపెనీ పక్కనే రెండు పార్మా కంపెనీలు ఉన్నాయి. అక్కడకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆరుకు పైగా ఫైరింజన్లు మంటలను ఆర్పి వేశాయి. భారీ అగ్ని ప్రమాదం కారణంగా బాలానగర్ నుండి గండి మైసమ్మ వరకు రోడ్డు పూర్తిగా స్తంభించి పోయింది.

English summary
Fire Accident took place in Jeedimetla of Hyderabad and Shad Nagar of Mahaboobnagar district on Wednesday. Four dead in Mahaboobnagar accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X