అర్ధరాత్రి హల్‌చల్: లేడీ డాన్ పర్హా ఖాన్ అరెస్టు

పోలీసుల వివరాల ప్రకారం - కింగ్‌కోఠీ నియాజ్ ఖానాలో నివసించే ఎంఎ బాకర్ అలీ ఐద్రూన్ (51), అతని సోదరుడు అబీద్ హుస్సేన్‌లది ఉమ్మడి కుటుంబం. కింగ్‌కోఠీ ప్రధాన వీధిలో ఎనిమిది మడిగెలున్నాయి. అందులో ఒకదాన్ని చెల్లెలికి కేటాయించాలని నిర్ణయించారు. ఐద్రూన్ సోదరుడు లండన్‌లో ఉంటారు. చెల్లెలికి కేటాయించిన ఆ మడిగెను తన బావమరిది తాహెర్‌కు లీజుకిచ్చాడు. అస్తిపంపకాలు జరగకుండా, చెల్లెలికి కేటాయించిన మడిగెను లీజుకు ఇవ్వడాన్ని మిగతా సోదరులు వ్యతిరేకించారు. ఈ వివాదం కోర్టుకు ఎక్కింది. దానిపై స్టే ఉంది.
ప్రస్తుతం ఆ మడిగె తాహీర్ స్వాధీనంలోనే ఉంది. అందు తన కారును ఉంచి తాళం వేశాడు. ఆ విషయం లేడీ డాన్ పర్హా ఖాన్‌కు చేరింది. దాంతో సోమవారం అర్థరాత్రి దాటిీన తర్వత దబీర్‌పురాకు చెందిన ఎండి నజీయుద్దీన్, ఫతేనగర్‌కు చెందిన మహ్మద్ అమీర్, నవాబ్ కుంటకు చెందిన మహ్మద్ ఖాన్, తాహెర్ బిన్ ఖాళీద్ సయీద్ బాసిత్, ఫలక్‌నుమా నివాసి మహ్మద్ ఇర్ఫాన్, సైదాబాదుకు చెందిన మహ్మద్ మొయిజుద్దీన్‌లతో కలిసి పర్షాఖాన్ కింగ్ కోఠీకి చేరుకుంది.
వివాదంలో ఉన్న మడిగె షెట్టర్ తీసి కారును బయటకు తీశారు. దాంతో బస్తీవాసులంతా ఒక్కటయ్యారు. ఇది తమ బస్తీ సమస్య అని, ఏదైనా ఉంటే తామే కూర్చుని మాట్లాడుకుంటామని అంటూ పర్షాఖాన్‌కు ఎదురు తిరిగారు. దాంతో తాహెర్ వైపు ఉన్నవారికి, పర్షాఖాన్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పర్షాఖాన్‌తో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications