జైల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు జగన్ దూరం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జైలు ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. జైలు సూపరింటిండెంట్ కె. కేశవ నాయుడు జాతీయ పతాకను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జైలు అధికారులు ఖైదీలకు వివిధ పోటీలు నిర్వహించారు. ఆటల్లో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు ఆగస్టు 15వ తేదీన బహుమతులు అందజేశారు.
విఐపిల బ్లాక్స్‌తో ఇతర ఖైదీల బారాక్స్‌కు సంబంధం లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డితోపాటు బిపి ఆచార్య, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, ఇతర విఐపి ఖైదీలు స్వాతంత్ర్య దినోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు.
చంచల్‌గుడా మహిళా జైలులో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. మహిళా ఖైదీలకు ఒక్కొక్కరికి 200 గ్రాముల లడ్డు ఇచ్చారు. రంగోళీ పోటీలు జరిగాయి. ఇతర పోటీలు కూడా జరిగాయి. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి, సస్పెండైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. జైలు సూపరింటిండెంట్ బషీరా బేగం పతాకావిష్కరణ చేశారు. ఈ సమయంలో శ్రీలక్ష్మి ఇతర ఖైదీలకు దూరంగా ఉన్నారు. దూరం నుంచే వేడుకలను చూశారు.












Click it and Unblock the Notifications