వైయస్ విజయమ్మ సవాల్ స్వీకరిస్తారా: బాబుకు గట్టు

కులవృత్తులను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. బిసిలపై ప్రేమ ఉంటే చంద్రబాబు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని హితవు పలికారు. బాబుకు దమ్ముంటే వైయస్ విజయమ్మ చేసిన ప్రతిపాదనకు స్పందించాలన్నారు. బిసిలు చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ బిసిలకు వంద సీట్లు అంటూ ప్రకటన చేసిందని ఆయన విమర్శించారు. అయితే బాబు మాటలను వారు నమ్మడం లేదన్నారు.
గత సాధారణ ఎన్నికలలో బిసిలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇవ్వలేక పోయారన్నారు. అప్పుడు ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు ఇస్తానని చెబితే ఎలా అన్నారు. అంటే మరోసారి ఆ వర్గాలను మోసం చేసే ఎత్తుగడ అన్నారు. కాగా చంద్రబాబు నాయుడుకు వైయస్ విజయమ్మ ఆదివారం ఓ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె బిసిలకు వంద సీట్లు ఇచ్చే అంశంపై బాబుకు సవాల్ విసిరారు. వచ్చే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మాత్రమే బిసిలకు వంద సీట్లు ఇవ్వడం కాదని, తాము కూడా ఇస్తామని విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీతో పాటు తమ పార్టీ కూడా బిసిలకు వంద సీట్లు కేటాయిస్తే మిగిలిన పార్టీలు కూడా అలా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బిసిలకు వంద టిక్కెట్లు ఇవ్వడం కాదని, వారిని వంద సీట్లలో గెలిపించాలని ఈ తన సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా అన్నారు. బిసిలకు వంద టిక్కెట్లు ఇద్దామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నియోజకవర్గాలలో వారిని పక్కకు పెట్టవద్దని బాబుకు ఆ లేఖలో సూచించారు. బిసిల నియోజకవర్గాలలో ఎవరూ పోటీ చేయకూడదని ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications