వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండా మురళిపై అనర్హత ఇష్యు: ఆదేశాలకు హైకోర్టు నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Murali
హైదరాబాద్: వరంగల్ జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన కొండా మురళిని అనర్హుడుగా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై తక్షణం మధ్యంతర ఆదేశాలిచ్చేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శనివారం నిరాకరించింది. తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత వేటు వేయడానికి సరైన కారణాలు చూపలేదని.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకే మురళిపై అనర్హత వేటు వేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్‌పై ఇది కక్షసాధింపు చర్యేనని పేర్కొన్నారు. తదుపరి విచారణను న్యాయ స్థానం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

కాగా ఎమ్మెల్సీగా తనపై శాసనమండలి చైర్మన్ చక్రపాణి తనపై అనర్హత వేటు వేయడాన్ని వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి శుక్రవారం హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. శాసనమండలి చైర్మన్ చైర్మన్ చక్రపాణిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. చక్రపాణి న్యాయబద్దంగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. చక్రపాణి శాసనమండలి చైర్మన్‌గా వ్యవహరించకుండా, కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుసారం వ్యవహరించి తనపై అనర్హత వేటు వేశారని ఆయన ఆరోపించారు.

విప్ శివరామిరెడ్డి ఆడించినట్లుగా చక్రపాణి ఆడించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండా మురళిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ విప్ శివరామి రెడ్డి చక్రపాణికి ఫిర్యాదు చేశారు. శివరామిరెడ్డి ఫిర్యాదుపై విచారణ జరిపిన చక్రపాణి నెల రోజుల క్రితం కొండా మురళిపై అనర్హత వేటు వేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి, పుల్లా పద్మావతిపై కూడా శివరామి రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్లినందుకు పుల్లా పద్మావతి క్షమాపణ చెప్పి తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు. దీంతో ఆమె అనర్హత వేటు నుంచి బయటపడ్డారు.

కొండా మురళితో పాటు ఆయన సతీమణి కొండా సురేఖ మొదటి నుంచి వైయస్ జగన్ వంట నడుస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వారిద్దరు క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. శాసనసభ్యురాలిగా ఉన్న కొండా సురేఖ రాజీనామా చేశారు. అయితే, ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఆమెపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ కారణంగా ఖాళీ అయిన పరకాల శాసనసభా నియోజకవర్గం నుంచి ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

English summary
High Court of Andhra Pradesh adjourned YSR Congress party leader Konda Muralidhar Rao's petition, which is filed by him on his disqualification by Chakrapani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X