హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరు గంటలు శ్రీరాములును ప్రశ్నించిన ఎసిబి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sriramulu
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ వ్యవహారంలో కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు కర్ణాటక శాసనసభ్యుడు, బిఎఎస్సార్ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీరాములను మంగళవారం ఆరు గంటలపాటు ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ వ్యవహారంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎసిబి ఇచ్చిన నోటీసుల మేరకే తాను విచారణకు హాజరయినట్లు ఆయన తెలిపారు. అవసరమైతే మరోసారి ఎసిబి ఎదుట హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, చట్టాలను తాను గౌరవిస్తానని ఆయన సోమవారం చెప్పారు. ఈ సంఘటన తన పార్టీ భవిష్యత్తును దెబ్బ తీస్తుందనే వార్తలను ఆయన ఖండించారు. శ్రీరాములు తనను పిలిచి ఏప్రిల్ 21వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ గురించి మాట్లాడారని, హైదరాబాదులోని రావి సూర్యప్రకాష్ రావుకు న్యాయమూర్తులు చాలా మంది తెలుసునని, అతన్ని కలిసి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చేలా చూడాలని చెప్పారని కంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబు చెప్పారు.

సురేష్ బాబునే కాకుండా ఎసిబి అధికారులు గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బళ్లారి శానససభ్యుడు గాలి సోమశేఖర రెడ్డిని కూడా అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో ఎసిబి 11 మందిని అరెస్టు చేసింది. వీరిలో 8 మందిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.

ఈ కేసులో శ్రీరాములును కూడా ఎసిబి అధికారులు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ లభించేలా ముడుపుల కథను శ్రీరాములు నడిపించారని ఎసిబి అనుమానిస్తోంది. శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే.

English summary
ACB has grilled Karnataka MLA Sriramulu for 6 hours in former minister Gali Janardhan Reddy's bail deal case in Hyderabad. Sreeramulu after deposing before ACB said that he was no way concerned with the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X