మంత్రుల ద్వారా జగన్‌ను కాపాడేందుకే: కిరణ్‌పై టిడిపి

మంత్రి వట్టి వసంత్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని టిడిపి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఇనుగాల పెద్దిరెడ్డిలు వేరుగా అన్నారు. ధర్మాన ప్రసాద్ రాజీనామాను ఆమోదిస్తే ప్రభుత్వం కుప్పకూలుతుందనే భయం కిరణ్‌కు పట్టుకుందన్నారు. అందుకే ఆయన రాజీనామాను ఆమోదించడం లేదన్నారు. దోషులైన మంత్రులకు ఇతర మంత్రులు వత్తాసు పలకడం శోచనీయమన్నారు. రాజ్యాంగం ప్రకారం తీసుకునే కేబినెట్ నిర్ణయాలకు అందరిదీ బాధ్యత ఉంటుందన్నారు.
సిబిఐ విచారణ నుండి తప్పించుకునేందుకు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, తమపై వచ్చిన ఆరోపణలపై మంత్రులు ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. మంత్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఎ-5 నిందితుడిగా ఉన్న ధర్మాన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. ఆయన రాజీనామాను ఆమోదించి ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని డిమాండ్ చేశారు.
కిరణ్ కుమార్ ధర్మానను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. జగన్ కేసులో రాష్ట్ర సంపదను దోచేయడానికి మంత్రులు ఉమ్మడి బాధ్యతను సాకుగా చూపిస్తున్నారని, మంత్రిమండలి తల్చుకుంటే రాష్ట్రాన్ని కూడా అమ్మేయవచ్చుననే విధంగా వట్టి మాటలు ఉన్నాయన్నారు. ధర్మానను సిబిఐ విచారించేందుకు అనుమతించాలని, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications