టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్, పిఎస్‌లో హరీష్‌రావు ధర్నా

వారు విద్యుత్ సౌధలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు, ఎమ్మెల్యేల వద్ద కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇస్తామని ట్రాన్సుకో సిఎండి మాట తప్పారని ఆరోపించారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇస్తామని సిఎండి రాతపూర్వకంగా లేఖ రాసిచ్చి కూడా దానిని తప్పారని మండిపడ్డారు.
సీమాంధ్రలో విద్యుత్ కోత అంతగా లేదని కానీ తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ కోతలు ఉన్నాయన్నారు. తెలంగాణపై ఎందుకు కక్ష అని మండిపడ్డారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హరీష్ రావు కింద పడ్డారు. పోలీసులు తెరాసను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా వారు తగ్గక పోవడంతో వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ తరలించారు. ఎమ్మెల్యే వినయ భాస్కర్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధలోకి చొచ్చుకు పోయారు.
తెలంగాణ ప్రాంత రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇచ్చే వరకు తాను నిరాహార దీక్ష చేస్తానని బొల్లారం పిఎస్ వద్ద హరీష్ రావు ప్రకటించారు. ఆయన పిఎస్‌లోనే దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తాను దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. కాగా విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ బృందం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మధ్యాహ్నం మూడు గంటలకు కలవనుంది.












Click it and Unblock the Notifications