జాతక భయంతో పసికందు ప్రాణం తీసిన కసాయి తండ్రి

 Baby girl poisoned to death, father held
బెంగళూరు: తన కూతురు మంచి నక్షత్రంలో పుట్టలేదని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో ఓ కన్నతండ్రి కసాయిలా మారి ఇరవై రోజుల తన పసికందు ప్రాణాలు తీశాడు. కూతురి జాతకం బాగోలేదంటూ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మిన అతను కన్నతండ్రి ప్రేమను మర్చిపోయాడు. ముక్కుపచ్చలారని పసిపాపకు విషం పెట్టి ఆ చిన్నారి ఉసురు తీశాడు. కర్నాటకలోని త్యామగొండ్లు గ్రామంలో నివాసముండే నందీశ్, సవిత దంపతులకు 20 రోజుల క్రితం ఓ పాప జన్మించింది.

ఆ చిన్నారి జాతకం తెలుసుకునేందుకు నందీశ్ ఓ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లాడు. మీకు చెడ్డ రోజులు మొదలయ్యాయని, రెండు నెలల్లో ఆ పాప లేదా నీవు ఎవరో ఒకరు తప్పకుండా చనిపోతారని సదరు జ్యోతిష్కుడు చెప్పాడు. దీంతో కంగారుపడ్డ నందీష్.. పాపను చంపేస్తే తాను సురక్షితంగా ఉంటానని భావించాడు. ఆదివారం రాత్రి విషం కలిపిన పాలను సీసాలో పోసి పాపకు తాగించాడు. దీన్ని సవిత గుర్తించినా మామూలు పాలు పట్టిస్తున్నాడనుకుని పెద్దగా పట్టించుకోలేదు.

పాప నోటి నుంచి నురగ వచ్చిన విషయాన్ని సోమవారం ఉదయం గమనించిన సవిత... పాపను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. విష ప్రయోగం జరిగిందని, అందువల్లే పాప చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. నందీశ్ పాపకు పాలు తాగించిన విషయం గుర్తుకు రావడంతో సవిత అతణ్ణి నిలదీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నందీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. నందీష్ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటుంటాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+