వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుదిపేసిన కోల్‌గేట్: పార్లమెంటు ఉభయసభలూ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament adjourned:Oppn demands PM's resignation over Coalgate
న్యూఢిల్లీ: బొగ్గుగనుల కేటాయింపు వ్యవహారం మంగళవారం పార్లమెంటు ఉభయసభలనూ కుదిపేసింది. ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంటు ఉభయసభలు కూడా రేపటికి వాయిదా పడ్డాయియ బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకలను నిగ్గు తేల్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. దీంతో ఇరు సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన కొద్ది సేపటికే బొగ్గు స్కామ్‌పై చర్చ జరగాల్సిందేనని వివక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పొడియం ముందు బైఠాయించాయి.

కాగ్ నివేదికలోని అంశాలపై ప్రధానమంత్రి వివరణ ఇవ్వడమేకాకుండా తక్షణం రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) పట్టుబట్టింది. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభంకాగానే ఇరు సభల్లో బొగ్గు స్కామ్‌ను లేవనెత్తడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభను స్పీకర్ మీరా కుమార్, రాజ్యసభను ఛైర్మన్ హమీద్ అన్సారీలు రేపటికి వాయిదా వేశారు.

బిజెపి పార్లమెంటు సభ్యులకు అన్నాడియంకె, వామపక్షాలు, తెలుగుదేశం సభ్యులు మద్దతు పలికారు. ప్రతిపక్షాలను తిప్పికొట్టడానికి అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాను ఎంతగా సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో రవి శంకర్ ప్రసాద్, వెంకయ్యనాయుడు నేృతృత్వంలో బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు.

ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాగ్ నివేదికపై చర్చ కోసం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరావు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు. బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలు, రిలయన్స్ వ్యవహారంపై చర్చ జరగాలంటూ ఆయన స్పీకర్‌ను ఆయన కోరారు.

English summary
Both Houses of Parliament were adjourned for the day after a vociferous opposition demanded the resignation of Prime Minister Manmohan Singh in the wake of the Comptroller and Auditor General (CAG) report on the Coalgate scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X