ఐఐటి మద్రాసు తెలుగు విద్యార్థిని ఆత్మహత్య

వడ్రంగి ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. పోలీసులు వచ్చిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మానస మరణంతో కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో విషాదం అలుముకుంది. మానస ఈ నెల 1వ తేదీన చెన్నైలోని ఐఐటి మద్రాసులో ఎంటెక్‌లో చేరింది. మానస ఆత్మహత్య చేసుకున్న సమాచారం కుటుంబ సభ్యులకు మంగళవారం సాయంత్రం చేరింది.
గోదావరిఖనిలో ఫర్నీచర్ పనులు చేసే మేర్గు రాజేశం కూతురు మానస. ఒక కుమారుడు కూడా అతనికి ఉన్నాడు. పెద్ద కూతురు మానస చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ఇంటర్మీడియట్ వరకు మానస గోదావరిఖనిలోనే చదివింది.
కెమికల్ ఇంజనీరింగ్ పుట్టపర్తిలో చేసింది. గేట్‌లో ఆ తర్వాత మంచి మార్కులు రావడంతో ఐఐటి మద్రాసులో ఎంటెక్‌లో చేరింది. కూతురు మరణవార్త తెలిసిన వెంటనే రాజేశం చెన్నైకి బయలుదేరి వెళ్లాడు. మూడు రోజుల పాటు గోదావరిఖనిలోని తల్లిదండ్రులతో ఉండి వచ్చిన వెంటనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సహవిద్యార్థులు అడిగినా ఆ రోజు ఆమె క్లాసుకు వెళ్లలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications