వైయస్ అండతో జగన్ దోపిడి, బయట పెట్టండి: విహెచ్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన భర్త, అత్త చనిపోయినా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రధాని పదవి పలకరించినా తీసుకోని త్యాగశీలి అన్నారు. కానీ జగన్ మాత్రం పదవి కోసం పార్టీ పెట్టాడన్నారు. వైయస్ హయాంలో జరిగిన గుట్టును మంత్రులు విప్పాలన్నారు. వారికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. తమకు దస్తావేజులు పంపి ఫోన్లు చేశారని వారు చెబుతున్నారని, ఎవరి వద్ద నుండి ఫోన్లు వచ్చాయో చెప్పాలన్నారు.
తాము ఏ తప్పు చేయలేదని మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి ఆవేదన వ్యక్తం చేశారని, అయితే లబ్ధి పొందింది ఎవరో మాత్రం చెప్పక తప్పదన్నారు. వైయస్ బొమ్మ కాంగ్రెసుకు అవసరం లేదని, ఆ పేటెంట్‌ను జగన్ తీసుకున్నారని, కాబట్టి కాంగ్రెసు ఇక నుండి కేవలం సోనియా గాంధీ బొమ్మనే ఉపయోగించాలన్నారు. అప్పుటి వాటికి మంత్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా అంశంపై జాప్యం వద్దన్నారు.
రాజీనామా వ్యవహారంతో అధిష్టానానికి సంబంధం లేదని, ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ధర్మాన తాను నైతికత కోసమే రాజీనామా చేసినట్లు చెబుతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల వారు కూడా తమకు మద్దతిచ్చే రోజు వస్తుందని, తమ వైపు బిసిలు ఉన్నారు కాబట్టే వారిని ఆకర్షించేందుకు వైయస్ విజయమ్మ వంద సీట్ల ప్రకటన చేశారన్నారు. దివంగత వైయస్ పైన తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదన్నారు.












Click it and Unblock the Notifications