హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ పీఠం: చిరంజీవి మాటలు, విహెచ్ యాక్షన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-V Hanumanth Rao
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా, ఊడుతుందా అనే విషయంలో ఏ విధమైన స్పష్టత రావడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఉండేది ఇక 15 రోజులేనని చెప్పిన మాజీ మంత్రి పి. శంకరరావు మాటలను తేలిగ్గా కొట్టి పారేసినా రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు శైలి అర్థం కాకుండా ఉంది. ధర్మాన ప్రసాద రావు రాజీనామా విషయంలో విహెచ్ ప్రతి రోజూ ముఖ్యమంత్రిపై పరోక్షంగా వాగ్బాణాలు విసురుతున్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిని సమర్థించారు. పైగా, ముఖ్యమంత్రి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. ఆరోపణలు విచారణలో రుజువైతేనే ధర్మానపై చర్యలు తీసుకోవాలనే గొంతును ఆయన వినిపించారు. విహెచ్, చిరంజీవి మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.

ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకూడదని మంత్రులు ముఖ్యమంత్రిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనను అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాలనేదే పార్టీ అధిష్టానం మనోగతంగా విహెచ్ చెబుతున్నారు. దానిపై అధిష్టానం అభిప్రాయం అక్కర్లేదని విహెచ్ అంటున్నారు. అయితే, విహెచ్ మాటలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలా అనే అనుమానం రావచ్చు. కానీ విహెచ్‍‌కు సోనియా కుటుంబంతో, అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా సీరియస్‌గానే తీసుకోవాలని అంటున్నారు.

కాంగ్రెసు అధిష్టానం తమకు అత్యంత విశ్వాసపాత్రులైన నాయకుల చేత తాము చేయబోయే కార్యాలకు సంబంధించిన సంకేతాలు ఇప్పిస్తూ ఉంటుంది. నేరుగా తాను రంగంలోకి దిగకుండా తాము చేయదలచిన పనిని హనుమంతరావు వంటి నాయకులతో మాట్లాడించి చేయిస్తుంది. ముఖ్యమంత్రిపై వ్యతిరేకతతోనో, మరో కారణంగానో హనుమంతరావు మాట్లాడుతున్నారని అనుకోవడానికి లేదు. అధిష్టానం అభిప్రాయాన్ని తన వ్యక్తిగత అభిప్రాయాలుగా హనుమంతరావు వెల్లడిస్తూ ఉంటారు. అంటే, ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాలనేది అధిష్టానం అభిప్రాయంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీనికితోడు, కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెట్టడానికి మాత్రమే వి హనుమంతరావు మాట్లాడుతున్నారా, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించే ప్రయత్నంలో భాగంగా అధిష్టానం వ్యూహం ప్రకారం హనుమంతరావు నడుచుకుంటున్నారా అనేది అంతు చిక్కడం లేదు. అయితే, తాను వచ్చే ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని కిరణ్ కుమార్ రెడ్డి ధీమాతో ఉన్నారు.

English summary
According to political analysts - ambiguity is there on Kiran kumar Reddy's continuation as chief minister. Rajyasabha member V Hanumanth Rao endless attack on Kiran kumar Reddy may indicate something, what party high command wants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X