మావల్ల కాదు, చంద్రబాబు ఆశ్చర్యం: ఆనంపై మేకపాటి

తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆనంకు సరికాదన్నారు. సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చినా 26 జివోలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. జగన్‌ను ఇరికిద్దామనే దుర్బుద్దితో ఆ రోజు జివోలపై సమాధానం ఇవ్వలేదని, దానివల్లే మంత్రులు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మోపిదేవి వెంకటరమణ జైలులో ఉన్నా, ధర్మాన ప్రసాద రావు పేరు చార్జీషీటులో పెట్టినా అందుకు కారణం ప్రభుత్వమే అన్నారు. అప్పుడే సమాధానం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ఇప్పటికైనా ఆ 26 జివోలు కరెక్టో కాదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ దోపిడీ చేశారని ఆనం చెప్పడం సరికాదని, విజయమ్మపై అవాకులు, చెవాకులు పేలవద్దన్నారు. ఆనం వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బిసిలకు వంద సీట్లు అన్న విజయమ్మ ప్రకటనపై ఎద్దేవా సరికాదన్నారు. విజయమ్మ ప్రతిపాదనకు ఆశ్చర్యపోయానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెబుతుంటే ఆనం పెడార్థాలు తీస్తున్నారన్నారు.
దివంగత వైయస్ నిర్ణయాలను తాము ఎదిరించలేక పోయామని చెప్పడాన్ని మేకపాటి తప్పు పట్టారు. వైయస్ మరణించిన తర్వాత జగన్‌ను సిఎం చేయాలని ఆనం సోదరులు సంతకాలు చేశారని, అలా ఎవరి ప్రోద్భలంతో చేశారో చెప్పాలన్నారు. రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఎవరు చెబితే తెగనాడారో చెప్పాలన్నరు.












Click it and Unblock the Notifications