లవర్‌కు పురుగుల మందు తాగించిన యువకుడు

ఇద్దరు కలిసి చదువుకునే సమయంలో వారి మధ్య్ ప్రేమ అంకురించింది. అయితే, వారి పెళ్లికి యువకుడి తల్లి అంగీకరించలేదు. దాంతో అతను విజయవాడ వచ్చి ఉద్యోగం చేసుకున్నాడు. మౌనిక హైదరాబాదులో ఉంటోంది. ఇటీవల ఆమె విజయవాడకు వచ్చి పెళ్లి చేసుకోవాలని వంశీకృష్ణను కోరింది.
ఆ సమయంలో అతను ఆమెను బైక్‌పై ఎక్కించుకుని తాడేపల్లిగూడెం వూళ్ల గ్రామం వద్ద ముందుగా పురుగుల మందు కలిపి ఉంచిన థమ్సప్ తాగించాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వచ్చాడు. ఓ ఆటో డ్రైవర్ చూసి ఆమెను తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో చేర్పించాడు.
అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ లోగా ఆమె కుటుబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications