కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోరాడుతాం: వైయస్ పోస్టర్ ఆవిష్కరించిన విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కడప: ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద మంగళవారం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పోస్టర్లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 2న ఆయన మూడోవర్ధంతిని పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమాల నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి రూపొందించిన పోస్టర్లను వైయస్ సమాధి వద్ద ప్రజల సమక్షంలో విజయమ్మ ఆవిష్కరించారు.

వైయస్సార్ వికలాంగుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నరసింహుడు ఆధ్వర్యంలో చేపట్టిన వికలాంగుల దండయాత్ర పోస్టర్‌ను కూడా విజయమ్మ పులివెందులలో ఆవిష్కరించారు. ఈ నెల చివరినుంచి నవంబర్ నెలవరకు అన్ని జిల్లాల్లో 12 మంది వికలాంగుల బృందం పర్యటిస్తుందని సమితి అధ్యక్షుడు ఈ సందర్భంగా తెలిపారు.

కాగా బిసిల అభ్యున్నతికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీకి పలు బిసి సంఘాలు మద్దతు తెలిపాయి. మంగళవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కడప, అనంతపురం జిల్లాలకు చెందిన బిసి సంఘాల నేతలు విజయమ్మను ఘనంగా సన్మానించారు. వైయస్ హయాంలో బిసిలకు పెద్దపీట వేశారని.. ప్రస్తుతం బిసిలకు అసెంబ్లీలో వంద సీట్లు కేటాయిస్తామంటూ విజయమ్మ హామీ ఇచ్చిన నేపథ్యంలో మేమంతా రుణపడి ఉంటామన్నారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారూ. రాష్ట్రంలోని వైద్యశాలలు రోగశాలలుగా మారాయని ఆమె విమర్శించారు.తిరుపతి రుయా ఆస్పత్రిలో పసిపిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. రుయా ఆస్పత్రి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వైద్యశాలల మెరుగుకోసం పోరాడతామని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా తయారైందని, ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపై వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు స్పందించి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

English summary
YSR Congress honorary president YS Vijayamma launched late YS Rajasekhar Reddy poster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X