హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: హరీష్‌కు పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుపై పోలీసులు అధికారుల సంఘం గురువారం మండిపడింది. విద్యుత్ సౌధ వద్ద ఆందోళన సమయంలో తెరాస నేతలు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని, పోలీసు ఉన్నతాధికారులను దూషించారని ఇందుకు వారు 24 గంటలలోగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వారు స్పందించకుంటే ఆ తర్వాత మేం న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బుధవారం విద్యుత్ సౌధ వద్ద పోలీసులు తమ బాధ్యతలను నిర్వర్తించారని, బతిమాలి చెప్పినప్పటికీ తెరాస నేతలు వినిపించుకోలేదని, పైగా ఇన్స్‌పెక్టర్ కాలర్ పట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలు కేవలం పోలీసులకే ఉండాలా అని రాజకీయ నాయకులకు ఉండవద్దా అని ప్రశ్నించారు. తాము కేవలం తమ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నామని చెప్పారు. విధుల్లో ఉన్న అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, స్టీఫెన్ రవీంద్రను అసభ్యంగా దూషించిన హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.

గడిచిన కొంతకాలంగా విధుల్లో ఉన్న పోలీసులపై రాజకీయ నేతల ప్రవర్తన దురుసుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బంజారాహిల్సులో మంత్రి దానం నాగేందర్ పోలీసులు అధికారులపై ప్రతాపం చూపించారని, ఆయనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజకీయ నేతలకు, ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీసులపై దురుసు ప్రవర్తనపై తమ సిబ్బందిలో అసంతృప్తి, ఆగ్రహం వెలుగు చూస్తోందన్నారు.

English summary
Police Officers Association of Andra Pradesh were demanded TRS MLA Harish Rao's apology for his behavior while vidyuth soudha muttadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X