అస్సాం అల్లర్లు: బోడో ఎమ్మెల్యే ప్రదీప్ బ్రహ్మ అరెస్ట్

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కోక్రాఝర్ వద్ద ప్రదీప్ బ్రహ్మను అరెస్టు చేశారు. కోక్రాఝర్‌లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కాగా అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో బుధవారం అస్సాం మళ్లీ రగిలింది. ధుబ్రీ జిల్లాలో బుధవారం గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పులలో ఇద్దరు కూలీలు మృతిచెందారు.
పొలం పనులు చేస్తున్న కూలీల బృందంపై కొంతమంది తుపాకులతో దాడి చేశారు వారు తేరుకొని తప్పించుకునేసరికే ఇద్దరు కూలీలు తూటాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.దీంతో నెల రోజులుగా ఎడతెగకుండా కొనసాగుతున్న జాతి ఘర్షణలలో మృతి చెందిన వారి సంఖ్య 80కు చేరుకుంది. కర్ఫ్యూను తాత్కాలికంగా సడలించిన సమయంలోనే దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications