హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర, ధర్మాన బలి: అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా జాప్యం చేసేందుకు ప్రబుత్వం కుట్ర చేసిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావును బలి చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కుట్రలో భాగంగానే మంత్రులను బలి చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌పై కుట్రలో భాగంగా సొంత పార్టీ నాయకులను కూడా బలి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి కాంగ్రెసు ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై ఇంత పెద్ద కసరత్తు అవసరమా అని ఆయన అడిగారు. ఇప్పటికైనా ఢిల్లీలో పైరవీలు మాని రాష్ట్రంలో ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి నీరో చక్రవర్తిని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ కలిశారు. వికలాంగుల కోసం తాము చేపట్టే కార్యక్రమానికి మద్దతు పలకాలని ఆయన విజయమ్మను కలిశారు. వికలాంగుల కోసం వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కన్నా ఎక్కువ ఖర్చు చేశారని విజయమ్మ ఈ సందర్భంగా చెప్పారు.

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని వైయస్ రాజశేఖర రెడ్డి పరితపించారని ఆమె అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి వికలాంగుడికి వేయి రూపాయల పింఛను ఇస్తామని, అవసరమైతే అప్పటి పరిస్థితిని బట్టి దాన్ని పెంచుతామని ఆమె చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వికలాంగులకు న్యాయం జరగలేదని ఆమె విమర్శించారు.

English summary
YSR Congress party spokesperson Ambati Rambabu criticized that Congress is hatching conspiracy against his party president YS Jagan. He said that Congress high command is making his own party men scape goats to become delay in getting bail to YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X