పదవుల కోసం గ్రూపులు కట్టలేదు: మంత్రి జానారెడ్డి

త్వరలో తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన ఉంటుందని ఆయన చెప్పారు. వారం, పది రోజుల్లో పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు త్వరలో పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని ఆయన చెప్పారు. పార్టీలే గుర్తించి పదవులు ఇవ్వాలనేది తన ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీయే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్ష కారణంగానే తాను ఇన్నాళ్లు పదవుల్లో కొనసాగానని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ, అభివృద్ధి వంటి పలు అంశాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు 125 ఏళ్ల చరిత్ర కలిగిందని, ఒక్కసారి కాంగ్రెసుకు ప్రజలు దూరమైన అత్యధిక సార్లు గెలిపించారని ఆయన అన్నారు.
జానా రెడ్డి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సృష్టించారు. ఆయన శుక్రవారంతో 14 ఏళ్ల 11 నెలలు మంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఈ రికార్డు కాసు బ్రహ్మానంద రెడ్డి పేర ఉంది. కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయగా జానా రెడ్డి మాత్రం మంత్రిగానే పనిచేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి 14 ఏళ్ల 10 నెలల 28 రోజులు పనిచేశారు. కొణజేటి రోశయ్య 13 ఏళ్ల ఆరు నెలలు పనిచేశారు.












Click it and Unblock the Notifications